కోడుమూరు న్యూస్:( కిరణ్)కోడుమూరు పట్టణ సమీపంలోని భాస్కర్ రెడ్డి. మరియు రజకుల కాలనీకి సిసి రోడ్డు మురికినీటి కాలువలను ఏర్పాటు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి బి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్థానిక కోడుమూరు పట్టణంలోని భాస్కర్ రెడ్డి కాలనీ వాసులతో సిపిఐ బృందం మురికినీటి కాలువలను పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బి రాజు ఏఐటియుసి తాలూకా కార్యదర్శి మద్దూరు చిన్న రాముడు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి భాస్కర్ రెడ్డి కాలనీవాసులు సిసి రోడ్లు లేక మురుకునీటి కాలువలలో అనారోగ్యాలకు గురవుతూ ప్రజలకు విష జ్వరాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వస్తాయని రోడ్డు లేక ఇరువైపులా కంప చెట్లు ఉండటం వలన పాములు తేళ్లు వంటి విష పురుగులు తిరుగుతూ ఉంటాయి . కాబట్టి కాలనీకి సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని వారన్నారు ఇప్పటికైనా కనీసం మండలంలో ఉన్న అధికారులు కాలనీవాసుల పట్ల కనికరం చూపించి ఈ కాలనీ వాసులకు సీసీ రోడ్డు మురుగునీటి కాలవలను వెయ్యాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మద్దిలేటి కాలనీ ప్రజలు లక్ష్మీదేవి సుంకులమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు






