గూడూరు గ్రంథాలయం లో పుస్తక ప్రదర్శన

కిరణ్ 24×7 న్యూస్:

గూడూరు గ్రంధాలయంలో 58 వ గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా గ్రంథాలయ అధికారిణి కవితా బాయి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు గూడూరు గ్రంధాలయములోని అనేక పుస్తకాలు పరిశీలించి, చదివి ఆనందించారు.

గ్రంధాలయ అధికారిణి కవిత బాయి మాట్లడుతు గూడూరు గ్రంథాలయం లో దాదాపుగా పదివేల పుస్తకాలు వున్నాయని విద్యార్థిని విద్యార్థులు స్వల్ప రుసుము తో వున్న గ్రంథాలయ సభ్యత్వం తీసుకొని ఎన్నో మంచి పుస్తకాలను చదువుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిణి కవిత బాయి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.