చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు.
కిరణ్ 24 x7 న్యూస్:
నిందితుడి నుండి 9 లక్షల 25 వేల విలువ గల
(9 తులాల బంగారు ఆభరణాలు ,
55 తులాల వెండి , ఒక లక్ష రూపాయల నగదు) ప్రాపర్టీ రికవరీ స్వాధీనం.
కర్నూల్ డిఎస్పి కార్యాలయంలో వివరాలు వెల్లడించిన… కర్నూల్ డిఎస్పీ బాబు ప్రసాద్.

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కోడుమూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ తబ్రేజ్ మరియు సి . బెళగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై యు.. వేణు గోపాల్ రాజు ఆధ్వర్యంలో, ఎఎస్సైలు నాగయ్య , హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుల్ లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుధర్శన్ మరియు సత్యరాజు లు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు.
క్రైమ్ నెం. 155/2025 పై దర్యాప్తు ను కొనసాగించగా నేరముకు పాల్పడిన నిందితుడు గా ఉన్న గిర్నీ వెంకటేష్,( 45 సం లు) తండ్రి తిమ్మన్న తిమ్మం దొడ్డి గ్రామం, సి బెళగల్ మండలం.
నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి అయిన గిరిని వెంకటేష్ ని ఈరోజు ఉదయము 11 గంటల సమయంలో సి.బెళగల్ గ్రామం నుండి చింతామానుపల్లి గ్రామునకు పోవు దారిలో ఉన్న గుట్టల నాగమ్మ గుడి వద్ద సి.బెళగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూల్ డిఎస్పీ బాబు ప్రసాద్ నిందితుని వివరాలను కర్నూల్ డీఎస్పీ కార్యాలయంలో వెల్లడిస్తూ మాట్లాడారు…
సి. బెళగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని తిమ్మందొడ్డి గ్రామంలో సెప్టెంబర్ 25 న దొంగతనం జరిగిందని తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు చిన్న రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు దొంగతనాల కేసులు, ప్రాపర్టీ కేసులలో దర్యాప్తులు వేగవంతం చేయడం జరిగిందన్నారు.
పాతనేరస్తులను విచారణ చేయడం , సిసి కెమెరాల పుటేజిలను వర్క్ ఔట్ చేయడంతో ఈ నిందితుడి గుర్తించి పట్టుకున్నామన్నారు.
సి. బెలగల్ మండలం, తిమ్మం దొడ్డి గ్రామానికి చెందిన గిర్ని వెంకటేష్ (45) నుండి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు , సుమారు 55 తులాల వెండి , లక్ష రూపాయల నగదు స్వాధీనపరచుకుని అరెస్ట్ చేయడమైనదన్నారు.
రికవరి చేసిన ప్రాపర్టీ ని సంబంధిత యజమానులకు కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుందన్నారు.
ముద్దాయిని ఈ రోజు రిమాండు కు పంపించడం జరుగుతుందన్నారు.
ఇతని పై ఏమైనా పాత కేసులు ఉన్నాయా అని విచారణ చేస్తున్నామన్నారు.
ఇతని వేలిముద్రలను సేకరించి అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు.
ప్రాపర్టీ కేసుల పై పకడ్బందీగా దర్యాప్తులు చేపడుతున్నామన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో కర్నూలు డిఎస్పీ గారితో పాటు కోడుమూరు సిఐ తబ్రేజ్ , సి. బెళగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు , సిబ్బంది ఉన్నారు.






