కె. నాగలాపురం పోలీసు స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు మండలం కె. నాగలాపురం పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శుక్ర వారం వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు.
డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు. కేసులు నమోదుచేసి శిక్షలు పడేవిధంగా చేయాలన్నారు.
ప్రాపర్టీ కేసులను చేధించి రికవరీలు చేయాలన్నారు.
విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు.
బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.
పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
సైబర్ నేరాలపై, మహిళల చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా ఎస్పీ తో పాటు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ , డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు, కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు, కె. నాగలాపురం ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఉన్నారు.
శ్రీ సుంకులా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ..
గూడూరు మండలం కే నాగలాపురం గ్రామంలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అధికారి పిఎన్ రాధాకృష్ణ గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి సురేష్ మందుల సుంకన్న ఆలయ సిబ్బంది కేశవ వీరికి స్వాగతం పలికీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి భాను ప్రసాద్ సిఐ చంద్రబాబు నాయుడు మరియు స్థానిక ఎస్సై శరత్ కుమార్ రెడ్డి పోలీస్ శాఖ సిబ్బంది వారు పాల్గొన్నారు.






