గూడూరు లో..హెల్మెట్ వాడకంపై అవగాహన.
గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత రెడ్డి.
కిరణ్ 24×7 న్యూస్:
వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత రెడ్డి మరియు సిబ్బంది వాహనదారులకు హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.
అత్యధిక స్పీడుతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ క్షేమంగా తమ గమ్యాలకు చేరాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు గూడూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.






