బాధితులను పరామర్శించిన కోడుమూరు వైసిపి పార్టీ ఇన్చార్జి..

కిరణ్ 24×7 న్యూస్:

కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క కార్య‌క‌ర్త‌కు చిన్న ఇబ్బంది క‌లిగిన వెంట‌నే స్పందిస్తానని వైఎస్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ తెలిపారు.

బుధవారం కర్నూలు మండల లోని పడిదంపాడు గ్రామానికి చెందిన కర్నూలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో గాయాలు అయి కర్నూలు ప్రభుత్వం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విష‌యాన్ని వారి కుటుంబ సభ్యుల ద్వారా డాక్టర్ స‌తీష్ కి స‌మాచారం రావడంతో ఆయన వెంట‌నే క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి చేరుకొని వెంకటేష్ ను ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్ట‌ర్ల‌ను ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో గూడూరు మండల జడ్పిటిసి మౌలాలి, ఎదురూరు వెంకటేష్ తదితరులు ఉన్నారు.