చెన్నకేశవ స్వామి వార్షిక జాతర ఉత్సవాల్లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే…
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు మండలం గార్గేయపురంలో జరిపిన చెన్నకేశవ స్వామి వార్షిక జాతర ఉత్సవాల్లో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
గార్గేయపురంలో ప్రతి సంవత్సరం జరిపే ఈ జాతర ప్రాంతీయ సంప్రదాయాలు, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాతర ప్రాంగణానికి చేరుకున్న వెంటనే స్థానిక పెద్దలు, మహిళలు, యువత మరియు గ్రామస్తులు ఎమ్మెల్యే ని ఆత్మీయంగా స్వాగతించారు.వెంటనే పూజాకార్యక్రమాలు చేసి చెన్న కేశవ స్వామి రథాన్ని ప్రారంభించారు.జాతరలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, శోభాయాత్రలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూసి ఆనందించిన ఎమ్మెల్యే .
గ్రామీణ సంప్రదాయాలను కాపాడుకోవడం, యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించడం చాలా ముఖ్యమని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అనంతరం దేవాలయంలోకి వెళ్ళి చెన్నకేశవ స్వామి ను దర్శించుకొని కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా గ్రామ ప్రజలకు సకల ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మెన్ ఫక్రుదిన్ ,నాయకులు నరేంద్ర రెడ్డి, అజేయులు,సీతారామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ,రామోజీ రావు, సయ్యద్ గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.







