కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ను అభినందించిన వైయ‌స్ జ‌గ‌న్‌..

కిరణ్ 24×7 న్యూస్:

ఏడాదంతా కంటి వైద్య శిబిరం అద్భుత కార్యక్ర‌మన్న పార్టీ అధినేత‌

కంటి వైద్య శిబిరం క‌ర‌ప‌త్రాలు ఆవిష్క‌రించిన మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తితో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాట‌లో రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌గారిని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. కంటికి చూపుకు భరోసా.. ప్రతి ఇంటికి వైద్యం అన్న నినాదంతో వైఎస్ జగన్ పుట్టిన రోజు కానుకగా డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఈ నెల 21వ తేదీన ప్రారంభించ‌నున్న‌ వినూత్న కార్యక్రమం పోస్ట‌ర్‌, క‌ర‌ప‌త్రాల‌ను గురువారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు వారితో పాటు జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ సేవా దృక్ఫ‌థాన్ని పార్టీ అధినేత అభినందించారు.

సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత స‌హ‌కారం అందించాల‌న్న గొప్ప మ‌న‌సును మెచ్చుకున్నారు. ఇందుకు స‌హ‌క‌రిస్తూ..అన్ని విధాల ప్రోత్స‌హిస్తున్న కుడా మాజీ చైర్మ‌న్‌, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ ఎస్ఈసీ స‌భ్యుడు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిని కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.

21వ తేదీ నుంచి కంటి వైద్య‌శిబిరాలు ప్రారంభం
కోడుమూరు నియోజకవర్గంలో ఏడాదంతా కంటి వైద్య పరీక్షలు చేసేందుకు వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు డిసెంబ‌ర్ 21న గూడూరు పట్టణ నందు వాసవి కళ్యాణ మండపంలో ప్రారంభిస్తున్నారు. ప్రతి గ్రామంలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అధినేత పుట్టినరోజును కేవలం వేడుకగా కాకుండా పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే సేవగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. కోడుమూరు నియోజకవర్గంలో ఈ ఏడాది ప్రారంభమయ్యే ఈ కంటి వెలుగు కార్యక్రమం, వచ్చే ఏడాది జగనన్న పుట్టినరోజు నాటికి వేలాది మందికి చూపును తిరిగి అందించి. వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి ప్రోత్సాహంతో..

జగనన్న పుట్టిన రోజునే కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాల‌న్న డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆలోచ‌న‌ను కుడా మాజీ చైర్మ‌న్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి ప్రోత్స‌హించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏడాదంతా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదిమూలపు సతీష్ నిర్ణ‌యాన్ని అభినందించారు. ప్రతి గ్రామంలో ఈ శిబిరం ఏర్పాటు చేసి ప్రజలందరికీ దృష్టి లోపం లేకుండా వైద్యసేవలు అందించాలని గొప్ప సంక‌ల్పంతో ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న ముహుర్తం ఖరారు చేయ‌డం నిజంగా పండుగ‌నే అన్నారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ కూడా తన వంతుగా ప్రజలకు సేవా చేయాలని నిర్ణయించుకోవ‌డం గొప్ప విష‌యం అన్నారు. తాను స్వతహాగా కంటి వైద్యుడు కావడంతో తన నియోజకవర్గంలో ఎవరూ కూడా దృష్టిలోపంతో బాధపడకూడదని భావించాడు. ఇదే ఆలోచనను రాజకీయ గురువుగా సంతోషిస్తున్నాన‌ని, మేమిద్దం ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాల‌తో నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామ‌ని, ఇలాంటి అవ‌కాశం క‌ల్పించిన మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.