సారాయి తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు…
కిరణ్ 24 x 7 న్యూస్:
గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాయి తయారీ కేంద్రాలపై గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో పోలీసులు సారాయి కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి సారాయి (అర్రాక్) నీ ధ్వంసం చేశారు. సారాయి కేంద్రాలలో సుమారుగా 300 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకుని నాశనం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా సారాయిని తయారుచేసి విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు. గూడూరు పోలీసుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం..

గూడూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్  తబ్రేజ్ గూడూరు ఎస్సై రాజా కుళ్లాయప్ప , నేతృత్వంలో గూడూరు నుండి పాలకుర్తి రహదారి వైపు మలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న రహదారిలో ఉన్న గుంతలను ఎర్ర మట్టితో కప్పి ప్రయాణ ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. రహదారి మలుపు వైపు గుంతలుగా ఉండి రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొనడంతో కోడుమూరు సిఐ గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పందించి సమస్యను పరిష్కరించేందుకు వారి ఆధ్వర్యంలో ఎర్రమట్టిని గుంతలపై పూర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు మరియు రహదారి మలుపు వైపు ఉన్న కంపచెట్లను తొలగించారు.ఈ కార్యక్రమంలో ఎఎస్సై లక్ష్మీనారాయణ, తిరుమలేష్, రజాకి్మియ, షఫీ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

గూడూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో బుధవారం సైబర్ నేరాల అవగాహన మరియు మహిళా భద్రత అవగాహన కార్యక్రమాన్ని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగాఎస్ఐ రాజకుళ్లాయప్ప మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన సైబర్ మోసాలు, వేధింపులు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు మొదలైన వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు పోలీసులు..

గూడూర్ పోలీస్ ఆధ్వర్యంలో కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్, గూడూరు సబ్ ఇన్స్పెక్టర్ రాజ కుల్లాయప్ప మరియు పోలీస్ సిబ్బంది గూడూరు పట్టణంలోని ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఏబీఎన్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని సోదరులకు సోదరిమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు వారు తెలియజేశారు.