గూడూరు పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి..
కిరణ్ 24×7 న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,ప్రజానాయకులు కీ.శే. నందమూరి తారకరామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ నాయకులు కొనియాడారు.
ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత లక్ష్యంగా అనేక సంస్కరణలను అమలు చేసి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేశారని తెలిపారు.
రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవను ప్రతిష్టించిన మహానాయకుడిగా ఎన్టీఆర్ గారు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీ పాత బస్టాండ్ ప్రాంగణంలో టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ గారు చూపిన ప్రజాసేవ స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోజుగు సృజన్, సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్,కౌన్సిలర్లు మల్లాపు బుడ్డంగలి, కోడుమూరు షాషావలి,కుమ్మరి ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్లు పెద్ద చాంద్, నరసింహులు,వాల్మీకి సంఘం అధ్యక్షులు బాబు,విద్యా కమిటీ చైర్మన్ కర్ణ, మరియు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







