*బి క్యాంప్ వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసిన దాత యువనేత గౌతమ్ రెడ్డి విష్ణు యువసేన*
కర్నూల్ స్పోర్ట్స్ కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు పట్టణంలోని స్థానిక బి క్యాంప్ జూబ్లీ కళాశాల మైదానంలో వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన యువ నేత విష్ణు యువసేన గౌతమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలి దేశ ప్రగతిని దేశ ప్రతిష్టను కాపాడాలని యువత దేశ రక్షణకు ఉపయోగపడతారని క్రమశిక్షణతో మెలగాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ శిక్షకుడు రవితేజ ఏఈ రాజులయ్య క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.






