అప్పుల బాధతో రైతు ఆత్మహత్య…
కిరణ్ 24x 7 న్యూస్:
గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన సింగాని చిన్న వెంకటేశ్వర్లు,( వయసు 55) సంవత్సరాలు, వ్యవసాయం వలన జీవనం కొనసాగించేవాడు. అప్పుల బాధతో ఆదివారం తెల్లవారుజామున సుమారు 5గంటల సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

మృతి చెందిన రైతు సింగాని చిన్న వెంకటేశ్వర్లు

మృతుడు సింగాని చిన్న వెంకటేశ్వర్లు ఆదివారం పంట పొలాల్లోని వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. గమనించిన మృతుని కొడుకు సింగాని శ్రీనివాసులు వెంటనే కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తండ్రి చిన్న వెంకటేశ్వర్లను తీసుకొని వెళ్లారు.

ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి రైతు చిన్న వెంకటేశ్వర్లు ఆసుపత్రికి రాకమునుపే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

మృతుడు చిన్న వెంకటేశ్వర్లు సొసైటీ బ్యాంకు లోను మరియు గ్రామస్తుల దగ్గర అప్పులు ఎక్కువగా ఉండడంతో అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపానికి గురై ఉరి వేసుకొని మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప సమాచారం ఇచ్చారు..