kiran24x7news:-

*ప్రతి కుటుంబానికి జగన్ పథకాలు అందాయి*
-కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్ గారు..

గూడూరు మండలం నాగలాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడు లబ్ది పొందారని అన్నారు.. వైద్యం విషయంలో ప్రతీ పేదవాడికి 24 గంటలు అందుబాటులో ఉంటానని, ప్రతి పేదవాడి ఇంటికి నేనే డాక్టర్ అవుతా అని అన్నారు, విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, కోడుమూరు నియోజకవర్గాన్ని విద్యారంగంలో ముందు ఉంచుతానని ఎమ్మెల్యే అభ్యర్థి డా.సతీష్ గారు అన్నారు.. అలాగే పేద ప్రజలయిన పెన్షన్ దారులను ఇబ్బందికి గురిచేసేలా కుట్రలు చేసిన చంద్రబాబు కు ప్రజలు ఓట్ల రూపంలో, తగిన బుద్ధి చెప్పాలని, కూటమి నాయకుల డిపాజిట్ లు గల్లంతు అయ్యేలా తీర్పు ను ఇయ్యాలని పిలుపునిచ్చారు..

అలాగే రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ మౌలాలి, గూడూరు చైర్మన్ వెంకటేశ్వర్లు, కోడుమూరు రవి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఉల్చాల రామ్మోహన్ రెడ్డి, గుడిపాడు లక్ష్మికాంతారెడ్డి, నాగలాపురం నర్సింహారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ మధుసూదన్, కమ్మ శ్రీను, మునిస్వామి, బిసి మాదన్న, బుడిదపాడు కొండారెడ్డి, దివాకర్ రెడ్డి, దౌలత్ పాషా, నాగరాజు, సుబ్బన్న, పెంచికలపాడు సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మద్దిలేటి, సింగిల్ విండో ఎల్లారెడ్డి, మహిళ విభాగం నాయకులు జ్యోతి, ఉమ మహేశ్వరమ్మ, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు