kiran24×7news : గూడూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈద్గా లో ప్రత్యేక నమాజు నిర్వహించారు. మత గురువులు ఈద్-ఉల్-ఫితర్ యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు.
రంజాన్ నెలలో ఉపవాసం దీక్షలతో ఉన్న ప్రతి ఒక్కరూ తమ చెడు అలవాట్లను దూరంగా ఉండి ఈ నెల మొత్తం శాంతి, సత్య మార్గం నడిచి దానధర్మాలు చేయాలని ఈ పండుగ ఉద్దేశమని తెలిపారు. ప్రపంచ శాంతి చేకూరాలని మత పెద్దలు ఈ సందర్భంగా ప్రత్యేక దువా చేశారు. పట్టణంలోని ముస్లిం సోదరులు వైసిపి పార్టీ నాయకులు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం గారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్ కౌన్సిలర్ మద్ది కౌన్సిలర్ ఖలీల్ మరియు ముస్లిం నేతలు స్థానిక పెద్దలు యువకులు పాల్గొన్నారు.






