- వైసిపి ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం
- రాష్ట్ర అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం.
- ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు.
kiran24×7news : కోడుమూరు మండలం గోరంట్ల , కొత్తపల్లి గ్రామలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలకు సతీష్ గార్లు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించి పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడ్డారని అన్నారు అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వం లో అన్ని వర్గాలు అన్ని మతాలు, అన్ని కులాల వారు సుఖ సంతోషాలతో ఉన్నరని అన్నారు.. చంద్రబాబు మరియు వారి కూటమి నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి డిపాజిట్లు కూడా రావన్నారు.. చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ పైన మరియు పెన్షన్ పొందుతున్న వికలాంగులు మరియు వృద్ధులపై కుట్రపూరితంగా వ్యవహరించిన తీరును ప్రతులు గమనించారని కావున చంద్రబాబుకు తగిన బుద్ధి ఓటు ద్వారా చెప్పాలని ప్రజలను కోరారు..
నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని అన్నారు అలాగే విద్య వైద్యం విషయంలో అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటానని డాక్టర్ సతీష్ హామీ ఇచ్చారు..
రానున్న ఎలక్షన్ లో రెండు ఓట్లు వైసిపి పార్టీకి వేయాలని ఒకటి ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి మరొకటి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, ఎంపీపీ రూతమ్మ, సింగిల్ విండో ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, శివారెడ్డి, ఎంపీటీసీ కురువ మస్తాన్, ఎంపీటీసీ సజ్జల రవి, మల్లారెడ్డి, ప్రసాద్, రవికుమార్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, కురువ చిన్న పరుశురాముడు, సద్దల కైలాస్, మాధవ నాయుడు, కురువ నడిపి మాదన్న, చెప్పురా సద్దల గోపాల్, కుమ్మరి మధు, సంకటి మధు, సద్దల అయ్యన్న, శివ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.






