kiran24×7news :

ఓటు హక్కు ను స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోండి… కే. నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని గూడూరు మండలం K.నాగాలాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని K.నాగాలాపురం, పెంచికల పాడు, బడిదపాడు, పర్ల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
K.నాగాలాపురం ఎస్సై ఎపి శ్రీనివాసులు పోలీసులు సాయుధ బలగాలు పాల్గొన్నారు.