kiran24x7news:

గూడూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని భారీ ర్యాలీలు నిర్వహించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి  జయంతిని కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి కర్నూల్ నుండి ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ముఖ్యఅతిథిగా హాజరుకాగా గూడూర్ నగర పంచాయతీ చైర్మన్ గెలుపాల వెంకటేశ్వర్లు మరియు గూడూరు మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మొదటిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వాళ్ళ అర్పించారు అనంతరం ఆయన జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడిచి సమ సమాజ స్థాపనకై కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ట్రాక్స్ గిడ్డయ్య ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో కృష్ణ వేణు రాము నడుపురు రంగడు తిమ్మరాజు మరియు సంజీవ నగర్ పెద్దలు యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.