kiran24×7news :
గూడూరు పట్టణం 20వ వార్డు కోటవీధి కి చెందిన షబ్బీర్ వారి కుటుంబ సభ్యులు శుభకార్యానికి వస్తువుల కొనుగోలుకు కర్నూలుకు ఆటోలో వెళ్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి గూడూరు పెద్ద కాలువ వద్ద ఆటోబోల్తా పడిందని కోటవీధి షాషా, కౌన్సిలర్ నందకిషోర్ ల ద్వారా ఫోన్లో విషయాన్ని తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రచారాన్ని ఆపివేసి మానవతా హృదయంతో స్పందించి వెంటనే బయలుదేరి వెళ్లి వారిని ఆసుపత్రిలో చేర్పించినారు..
అలాగే గాయాలైన వారికి అవసరమైన వైద్యాన్ని అందించి, చికిత్స విషయంలో డాక్టర్లకు సలహాలు ఇచ్చి, ప్రత్యేక శ్రద్ధను చూపాలని కోరారు..






