kiran24x7news:
కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో ప్రచారం నిర్వహించి, ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగన్ గారు బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్ గారిని, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని గెలిపించాలని కోరిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు..
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పేదవారికి అందాయని, కులాలకు, మతాలకు తావివ్వకుండా అందరికి మేలు చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని అన్నారు.. వృద్దులకు, వికలాంగులకు నేరుగా ఇంటికి పెన్షన్లు అందిస్తుంటే చంద్రబాబు కుట్రచేసి పెన్షన్ దారులు కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన చంద్రబాబు, తన కూటమికి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు..
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన రానున్నది జగనన్న ప్రభుత్వమే అని, మళ్ళీ సీఎంగా జగనన్న కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.. కోడుమూరు నియోజకవర్గం మళ్ళీ వైసిపి పార్టీ జెండా ఎగరబోతుందని అన్నారు..
రానున్న మే13న జరిగే ఎలక్షన్ లో ప్రజలంతా రెండు ఓట్లు వైసిపి పార్టీకి వేసి ఎమ్మెల్యే గా డా.ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీగా బివై రామయ్య గారిని గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి వెంకటశివుడు తిమ్మారెడ్డి మద్దిలేటి గిరిబాబు నాగేశ్వరరావు శీల బండ రాముడు డీలర్ రాముడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు






