గూడూరు మండలం మునగాల  గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం వైసీపీ పార్టీలో కి చేరారు .

కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సమక్షంలో వారు వైసీపీ పార్టీలోకి చేరారు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

మునగాల మాజీ ఎంపీపీ సత్య రెడ్డి మునగాల సర్పంచ్ గోపాల్ నాయకులు మునగాల రామాంజనేయులు నేత్రుత్వంలో 30 కుటుంబాలు వైసీపీ పార్టీలోకి చేరారు.. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ విజయం కోసం కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి సారధ్యంలో కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు నేతలు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.