kiran24x7news:

కర్నూలు మండలం పూడూరు, పడిదంపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కోడుమూరు ఎమ్మెల్యే గా డా.ఆదిమూలపు సతీష్ గారికి, ఎంపీగా బివై రామయ్య గారికి ఓట్లు వేసి గెలిపించాలని కోరిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే లు శ్రీ మణిగాంధీ గారు, శ్రీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు..

ఈ సందర్భంగా కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గార్లు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందితేనే ఓటువేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్ గారు అని అన్నారు.. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగిందని అన్నారు.. కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు జగనన్న పథకాలు మహిళలకు దోహపడ్డాయని అన్నారు.. పుట్టిన పిల్లల నుండి ముసలిదాకా జగనన్న ఏదో రకంగా కుటుంబాలకు తోడుగా నిలిచారన్నారు.. వృద్దులకు, వికలాంగులకు నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్ లు రాకుండా చేసి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన చంద్రబాబు కు తగినబుద్ధి చెప్పాలన్నారు.. జగనన్న పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పల్లెలో కక్షలు, గొడవలు పెట్టాలని చూస్తున్నారన్నారు.. ఎవరికైనా వైద్యం విషయంలో సమస్యలు ఉంటే తనకు నేరుగా ఫోన్ చేయమని ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు ఫోన్ నెంబరు ప్రజలకు ఇచ్చారు.. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో నాణ్యమైన విద్య, వైద్యం అందరకీ అందేలా కృషి చేస్తానన్నారు.. రోడ్డు సమస్య, నీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు..

చంద్రబాబు, తనకూటమి ఎన్ని కుట్రలు చేసిన, ప్రజలు వైసిపి ఫ్యాన్ గుర్తుకు ఓటువయ్యాడానికి సిద్ధంగా ఉన్నారని మళ్ళీ సీఎంగా జగనన్న కావడం ఖాయమని అన్నారు.. అలాగే కోడుమూరు గడ్డ ఎప్పటికి వైసిపి అడ్డ నే అని అన్నారు..

రానున్న మే13 న జరిగే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగనన్న బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆది మూలపు సతీష్ గారికి, ఎంపీగా బివై రామయ్య గారికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ప్రసన్న కుమార్, వైస్ ఎంపీపి నెహేమియా, మండల కన్వీనర్ మహబూబ్ బాషా, మాజీ మండల ఉపాధ్యక్షుడు డి.వాసు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండ్ ప్రెసిడెంట్లు వినయ్ కుమార్ రెడ్డి, అమర్నాద్ రెడ్డి, రామనుంజనేయులు గౌడ్, పూడూరు గ్రామ సర్పంచ్ మహేష్, ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, రేమట సంపత్, చక్రపాణి రెడ్డి, ఉల్చాల రామ్మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అఖిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బీచుపల్లి, మాజీ సర్పంచ్ ఏసేపు, సురేష్, మాజీ సర్పంచ్ ఇస్సాక్, దామోదర్ నాయుడు, మౌలాలి, ఓడ్ల రాజశేఖర్, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, చిన్న లక్ష్మన్న, నందనపల్లి సర్పంచ్ వెంకటేష్, రుద్రవరం సర్పంచ్ వెంకటేష్, దిన్నదేవరపాడు ఎంపిటిసి మద్దిలేటి, నందనపల్లి ఎంపిటిసి శేఖర్, పసుపుల శేఖర్, తాండ్రపాడు మోహన్ బాబు, సంపత్, వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి ఎదురురు వెంకటేశ్వర్లు, రెడ్డిపోగు ప్రశాంత్, సామేల్, తుల్జాపురం మహానంది రెడ్డి, బి.తాండ్రపాడు మోహన్, సామేలు, ఇ. తాండ్రపాడు భాస్కర్, దేవరపాడు దస్తగిరి, ఖలీల్, రేమాట సురేష్, సుంకేసుల హనుక్, బుర్ర వెంకటేశ్వర్లు, వినోదు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.