kiran24×7news ;

కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..

ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన నాయకులకు గ్రామస్తులంతా కలిసి డప్పు చప్పుళ్ళలో నృత్యాలు చేస్తూ, పూలమాలలు వేస్తూ, దారులంతా పూలతో పరిచి, ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో గ్యారంటీగా అమలు చేస్తాడని, పేదలకు మంచి జరుగుతుందని, గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, పేదలకు అదుకున్నడని, జగనన్న మాట ఇచ్చిండంటే వెనుకడుగు వెయ్యబోడని, కచ్చితంగా చేసి చూపెడుతాడని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో కృష్ణాపురం గ్రామం చాలా అభివృద్ధి జరిగిందని అన్నారు.. ఇంకా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు..

కోడుమూరు నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకొని, శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.. చంద్రబాబు చెప్పే మాటలను ఎవ్వరు నమ్మద్దని, ఇదివరకే గతంలో అబద్దాలు చెప్పి మోసం చేశాడని గుర్తుచేశారు.. అలాగే వృద్దులకు, వికలాంగులకు ఇంటికి వచ్చే పెన్షన్ ను కూడా కుట్రపురితంగా కేసులు పెట్టి, అవ్వ,తాతలు కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన చంద్రబాబు, ఈ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.. కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చూస్తామన్నారు.. అలాగే కృష్ణాపురం గ్రామానికి అభిమానంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్థులందరికి ధన్యవాదాలు తెలిపారు..

రానున్న మే13 న జరిగే ఎలక్షన్ లో ఫ్యాను గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే గా డా.ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీగా బివై రామయ్య గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ మాధాలు, మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, సి.బెళగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, రవి కుమార్ రెడ్డి, ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ మహేశ్వర రెడ్డి, రాంమోహన్ రెడ్డి, రఘునాథరెడ్డి, కొత్తకోట మహబూబ్ బాషా, రవికుమార్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ హనుమంతు, దస్తగిరి, సురేంద్ర రెడ్డి, వెంకటశివుడు, మద్దిలేటి, శివశంకర్, వెంకటేష్, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, మహిళలు, వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు