kiran24×7news ;

కోడుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భాగ్యరత్న గారి అధ్యక్షతన కార్మికుల (మేడే) దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ భాగ్యరత్న గారు మాట్లాడుతూ, కార్మికుల దినోత్సవం మా కార్మికుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం తరుపున వచ్చు pf, మరియు ఇన్సూరెన్స్ కల్పించడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. వీరు కరోనా సమయంలో చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో msp రాష్ట్ర నాయకులు ఆంధ్రయ్య టిడిపి మండల కన్వీనర్, కోట్ల కవితమ్మ, సిపిఎం డివిజన్ కార్యదర్శి, గఫుర్, సిపిఐ మండల కార్యదర్శి రాజు మాట్లాతు, ప్రపంచ దేశాలలో జరుపుకునే కార్మికుల దినోత్సవాన్ని, గ్రామ పంచాయతీ కార్మికుల మధ్యలో జరపడం సర్పంచ్ భాగ్యరత్న గారికి అభినందనలు తెలియచేశారు. పని గంటలు 12గంటలనుండి,8 గంటలకు మార్చడం మహానీయుల కృషి ఫలితం అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ప్రతాప్ రెడ్డి, షఫీ,mrps మండల నాయకులు Owners, AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీరాములు, ఆటో యూనియన్ నాయకులు మధు, రాముడు CITU నాయకులు ఈరన్న, కార్మిక నాయకులు మద్దిలేటి, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.