kiran24×7news ;
కొడుమురులో మేడే వేడుకలు కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ కార్యాలయం నందు కార్మిక జెండాను కార్మిక సంఘం సీనియర్ నాయకుడు దుల్లా భాస్కర్ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు మధు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి బి.రాజు, ఏఐటీయూసీ కార్యదర్శి చిన్న రాముడు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులకు 8గంటల పనివిధానం తీసుకురావాలని అందుకోసం ఏఐటీయూసీ గా ముందుండి కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి కొన్ని హక్కులను సాధించడం జరిగింది.కార్మికులకు సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ జెండావిష్కరణ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు గడ్డం నాగరాజు, హమాలి సంఘం నాయకులు బజారి,సుంకన్న, సీనియర్ నాయకుడు కోటకొండ మద్దిలేటి,తిమ్మప్ప,అయ్యన్న, పెద్ద శివుడు,ఆటో నాయకులు దస్తగిరి, మూర్తుజవలి,ఓబులేష్,చిన్న బజారి, రవి, నాగరాజు,చంద్ర, రమేష్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






