kiran24×7news ;
కోడుమూరు మండలం ఆమడగుండ్ల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీగా బివై రామయ్య గారిని ఆశీర్వదించి, గెలిపిస్తే కోడుమూరు నియోజకవర్గాన్ని మోడ్రన్ కోడుమూరుగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే కోడుమూరులో త్రాగునీరు, సాగునీరు, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు.. జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టో పేద ప్రజలకు మరింతగా మంచి జరిగేలా ఉందని అభిప్రాయపడ్డారు.. గతంలో జగన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చడని ఇప్పుడు ఇస్తున్న హామీలన్నీ కూడా తప్పక నెరవేస్తాడని అన్నారు..
జగన్ గారి పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని, ప్రతి పేదవాడికి, కుల మతాలకు అతీతంగా లబ్ధి జరిగిందని అన్నారు.. చంద్రబాబు చేస్తున్న కుట్రలకు ప్రజలంతా గమనించి చంద్రబాబు, తన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు..






