గూడూరు నగర పంచాయతీలోని ఎస్సీ కాలనీ నందు చైర్మన్ జలపాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ PN. అస్లాం రెండవ వైస్ చైర్మన్ గోనెగండ్ల లక్ష్మణ్ మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలొ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ది చేకూరిందని, కులాలు, మతాలు చూడకుండా ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అర్హులైన లబ్దిదారులకు ఇంటి గడప వద్దకే ప్రతి నెల పెన్షన్ డబ్బులు అందించి వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు అండగా ఉన్నామన్నారు.. కానీ చంద్రబాబు, కూటమి నాయకులు ఇంటివద్దకి వస్తున్న పెన్షన్లు చూసి ఓర్వలేక, కేసులు వేసి, అడ్డుకున్నారని ప్రజలు గమనించాలని, వారికి డిపాజిట్లు కూడా రాకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరారు.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని దొంగ మాటలు చెప్పిన ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడని, మళ్ళీ రానున్నది జగన్ గారి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. జగనన్న ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదిగిందని అన్నారు.. పేద వారందరికీ విద్య , వైద్యం అందేలా చూస్తామని అన్నారు.
రానున్న మే13వ తేదీన జరగనున్న ఎలక్షన్ లో వైసిపి ఎంపీగా బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే గా డా.ఆది మూలపు సతీష్ గారికి ఓట్ల వేసి గెలిపించి, జగనన్న కు కానుకగా అందించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది మరియు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మరల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు కావున ప్రతి ఒక్క వైసీపీ అభిమాని పాల్గొనవలసిందిగా కోరడమైనది.






