kiran24×7news ;
గూడూరు మండలంలోని మునగాల మల్లాపురం గ్రామాలలో శుక్రవారం టిడిపి నాయకుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది.
ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జిల్లా నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాగా కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు.. మునగాల మల్లాపురం గ్రామాలకు చేరుకున్న ముఖ్య అతిథులకు స్థానిక నేతలు కార్యకర్తలు మేళ తాళాలతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.. అరాచక పాలనను అంతం చేయాలంటే టిడిపి పార్టీ కి ఘనవిజయం అందించాలని వారు ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మల్లాపురం నాగార్జున రెడ్డి మల్లాపురం సుల్తాన్ రాంభూపాల్ రెడ్డి ఉప్పరి కాష్మన్న బోయ పెద్ద కాష్మన్న బోయ చిన్న. డీలర్ మిన్నెల ఉషన్ మదర్ సాహెబ్. బోయ చిన్న రాముడు కురువ పెద్దదస్తగిరి గుడిపాడు మహేశ్వర్ రెడ్డి గోపాల్ మునగాలనబి షావలి మరియుమల్లాపురం గ్రామ ప్రజలు పెద్దలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.






