kiran24×7news ;

కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ గారు, కోడుమూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్ గారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతీ ఒక్క కుటుంబం లబ్ది పొందిదని, సంక్షేమ పథకాలు అర్హులైన అందరికి అందాయని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో పల్లెలు, పట్టణాలు శరవేగంతో అభివృద్ధి చెందాయని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు.. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్ గారిది అని అన్నారు.. జగనన్న చేసేది మాత్రమే చెప్పుతాడని, చెప్పింది 100% చేస్తాడని అన్నారు..

మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో లోని అన్ని పథకాలను తప్పక నెరవేర్చి, పేదవాళ్లకు అండగా ఉంటాడని అన్నారు.. చంద్రబాబు లాగా దొంగ హామీలు ఇచ్చి, ప్రజలని మోసం చేయమని అన్నారు.. చంద్రబాబు చేసిన కుట్రల వల్ల నేడు అవ్వ , తాతలు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని కాబట్టి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు కు తగిన గుణపాఠం ఓటురూపంలో చెప్పి, వైసిపి పార్టీకి ఘనవిజయం అందించాలని కోరారు..