కిరణ్24×7న్యూస్;22, జూన్. గూడూరు నగరపంచాయతీ కార్యాలయంలో శనివారం నగర పంచాయతీ కమీషనర్ దివాకర్ రెడ్డి మరియు చైర్ పర్సన్ జె. వెంకటేశ్వర్లు అధ్యర్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాదులు అయిన డయేరియా, డెంగ్యూ, మలేరియా మొదలైన వ్యాధులు ప్రభలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురక్షిత నీటిని ప్రజలకు అందించడంతోపాటు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ మరియు శానిటేషన్ పై సిబ్బంది తగు జాగ్రత్తలు వహించాలంటూ ఆదేశించారు. వైద్యులు మాట్లాడుతూ ప్రజలు నీటిని కాచి వడపోసి త్రాగాలని తెలిపారు. సీజన్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వారు పలు సూచనలు ఇచ్చారు, కార్యక్రమంలో ఎంఈఓ, ఐసిడిఎస్, పబ్లిక్ హెల్త్, మెప్మా సిబ్బంది, కార్యాల సిబ్బంది పాల్గొన్నారు..