కిరణ్24×7న్యూస్; జూన్,20, గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయం సమావేశ భవనంలో గురువారం రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు మండల తహసిల్దార్ ఉదయ్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ దినోత్సవంను పురస్కరించుకుని రెవెన్యూ కార్యాలయ సంబంధిత సేవలను రైతులకు మండల ప్రజలకు తాసిల్దార్ వివరించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పాసు పుస్తకాలు, 1బి, అడంగల్, మరియు విద్యార్థులకు కుల ఆదాయ దృవీకరణ పత్రాలను అందజేశారు. రెవెన్యూ కార్యాలయంలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ రెవెన్యూ డే సందర్భంగా వారిని సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శారద, ఆర్ఐ వరలక్ష్మి ,సిబ్బంది రాఘవేంద్ర రెడ్డి, వీఆర్వోలు నాగేంద్ర, కృష్ణారెడ్డి మరియు మండలంలోని విఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పట్టణంలోని పెద్దలు పాల్గొన్నారు.