కిరణ్24×7న్యూస్, గూడూరు,( జూన్, 24) గూడూరు నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో (PGR) పబ్లిక్ గ్రివెన్సు రెడ్రేసల్ మీకోసం కార్యక్రమాన్ని కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇకనుండి ప్రతి సోమవారం కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తమకు అందజేయాలని తెలిపారు. వాటిని పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.






