గూడూరు పట్టణంలోని కోటవీధిలో గల మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజవర్గం వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్… ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు, మరియు కౌన్సిలర్లు కలాం, కుమార్ నాయకులు డాక్యుమెంట్ రైటర్ నజీర్ అబ్దుల్లా, శాస మరియు స్థానిక ముస్లిం సోదరులు నాయకులు పాల్గొన్నారు.







