కిరణ్ 24×7న్యూస్;
కోడుమూరు నియోజవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టి ఆయా గ్రామాల్లోని గణేశుని మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైసీపీ నాయకులు సంధ్యా విక్రంకుమార్.
ముందుగా కె. నాగలాపురం చేరుకొని అక్కడ కార్యకర్తలతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి జూలకల్లు గ్రామనికి చేరుకొని వైసిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులతో పాటు వినాయక మంటపంలో గణేష్ ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడుమూరు నియోజవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయుశ్ ఆరోగ్యాలతో వెలుగొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సి. బెళగల్ మండలం బ్యాతోలి గ్రామనికి చేరుకొని ఆ గ్రామనికి చెందిన సుంకన్న గారి భార్య ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలియజేశారు. బ్రాహ్మణ దొడ్డి నాయకులు మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు పెద్దలు సంధ్యా విక్రంకుమార్ ను సన్మానించారు.
నియోజకవర్గం పరిధిలోని గ్రామల్లో అడుగడుగున సంధ్యా విక్రంకుమార్ కు ప్రజలు నిరాజనాలు పలికారు. కార్యక్రమంలో గూడురు మరియు సి. బెళగల్ మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






