కిరణ్ 24x 7 న్యూస్;

కర్నూలు వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన…. జిల్లా ఎస్పీ..

భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీసిన … జిల్లా ఎస్పీ.

ఆదివారం వినాయక నిమజ్జన ఘాట్ ను జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ పరిశీలించారు.

కెసి కెనాల్ , వినాయక్ ఘాట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

గణేష్ నిమజ్జనం సంధర్బంగా వినాయక విగ్రహాలు బయలుదేరే మొదటి రాంబోట్ల దేవాలయం, బాదం మాస్క్ మీదుగా, కింగ్ మార్కెట్ , కొండారెడ్డి బురుజు మీదుగా అంబేద్కర్ సర్కిల్, రాజ్ విహార్ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం వినాయక నిమజ్జనం ఘాట్లోని కేసి కెనాల్ దగ్గర వినాయక విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబందించిన డ్రైవర్లను, గజ ఈత గాళ్ళను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఇతర శాఖలకు అధికారులకు తెలియజేశారు.

జిల్లా ఎస్పీ  వెంట కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ సిఐలు ప్రసాద్, రామయ్య నాయుడు, మురళీధర్ రెడ్డి, కేశవరెడ్డి, నాగరాజరావు, ట్రాఫిక్ సిఐ మనసూరుద్దీన్, గణేష్ ఉత్సవ సమితి కమిటి సభ్యలు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.