
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… కర్నూలు జిల్లా ఎస్పీ.
• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 91 ఫిర్యాదులు .
• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
కిరణ్ 24×7 న్యూస్ ;
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 91 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) నేను ఎమ్మిగనూరు బ్రాంచ్ – యూనియన్ బ్యాంకులో బిజినెస్ కరెస్పాండ్ గా పని చేస్తున్నాను. మే 17 న నా ఫోన్ నెంబర్ కు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా నా మొబైల్ ను హ్యాక్ చేసి రూ. 5 లక్షలు ఆన్ లైన్ ఫ్రాడ్ చేశారని యూనియన్ బ్యాంక్ లోని నా ఖాతా నుండి డబ్బులు కాజేశారని, నాకు న్యాయం చేయాలని ఎమ్మిగనూరు మండలం, కోటేకల్లు గ్రామానికి చెందిన ఇబ్రహీం ఫిర్యాదు చేశారు.
2) కర్నూలు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లో నా కుమారుడికి, నా కుమార్తె కు ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు, వెంకటరమణ కాలనీ కి చెందిన ఆయేషా బేగం, జహీర్ లు రూ. 5 లక్షల 75 వేలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , వివేక నగర్ కు చెందిన ఉదయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
3) ప్యాలకుర్తి కి చెందిన రాజు రూ. 25 వేలు ఇస్తే రూ. 8 లక్షలు స్పాట్ లోన్ (రుణం) ఇప్పిస్తానని చెప్పి నమ్మించి, ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకొని మోసం చేశాడని దేవనకొండ మండలం, పి. కోటకొండ గ్రామానికి చెందిన సంజన్న ఫిర్యాదు చేశారు.
4) వరి ధాన్యం కోనుగోలు చేసిన జి.శింగవరం గ్రామానికి చెందిన మల్లికార్జున శెట్టి నాలుగు సంవత్సరాల నుండి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు కు చెందిన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
5) ఆస్తి కోసం పెద్ద కుమారుడు కాశన్న, కోడలు సుగుణమ్మ ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని ఎమ్మిగనూరు, ఎర్రకోట గ్రామానికి చెందిన సుంకమ్మ ఫిర్యాదు చేశారు.
6) మా పొలంలోకి మమ్మల్ని రానివ్వకుండా మహదేవమ్మ, వన్నూరప్ప ఈ పొలం మాదే అంటూ దౌర్జన్యం చేస్తున్నారని హోళగుంద, కోగిల తోట గ్రామానికి చెందిన మారెమ్మ ఫిర్యాదు చేశారు.
7) నాకు తెలిసిన ఆర్ ఎంపి డాక్టర్ పాత కక్షలతో గుర్తు తెలియని వ్యక్తులచే ఫోన్ కాల్స్ చేయించి బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారని దిన్నెదేవరపాడు గ్రామం కు చెందిన రవితేజ ఫిర్యాదు చేశారు.
8) 5 ఎకరాలలో 1 ఎకర 16 సెంట్ల భూమి ని అక్రమంగా ఆన్ లైన్ చేసుకోవడమే కాకుండా మమ్మల్ని సుధాకర్ అనే వ్యక్తి కొట్టి గాయపరిచాడని వెల్దుర్ధి మండలం, బింగిదొడ్డి గ్రామానికి చెందిన వెంకటరాముడు ఫిర్యాదు చేశారు.
9) కుమారుడు, కోడలు వేధిస్తున్నారని, నన్ను ఇంటి నుండి బయటకు పంపించారని, నా ఇల్లు నాకు ఇప్పించే విధంగా చేయాలని, కుమార్తె దగ్గర ఉంటున్నాని కర్నూలు, మజూందార్ నగర్ కు చెందిన సుశీల ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ గుణశేఖర్ బాబు పాల్గొన్నారు.