ఆరోగ్య రక్షణలో ఆహార పాత్ర ఎంతో ఉంది… కర్నూలు ఎంపీ..
కర్నూలు పల్లె వాణి న్యూస్; కర్నూలు నగరం ఎన్.ఆర్ పేటలో ఉన్న శ్రీ లక్ష్మీ హై స్కూల్ లో నిర్వహించిన ఫుడ్ కార్నివాల్ ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు..ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్ స్టాళ్ల ను సందర్శించి వాటిని రుచి చూసి విద్యార్థులను అభినందించారు..ఆరోగ్య రక్షణ లో ఆహారం పాత్ర ఎంతో ముఖ్యమైనదని, పోషకాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని ఎం.పి బస్తిపాటి నాగరాజు తెలిపారు..ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆహారం యొక్క విలువ తెలుస్తుందన్నారు.