కిరణ్ 24×7 న్యూస్ :గూడూరు మండల తాసిల్దార్ కే. రామాంజనేయులు కు ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు ఎస్సి కులానికి చెందిన నేతలు తమకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి న్యాయమైన తమ డిమాండ్లకు సహకరించాలని తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ బాంసేపు మరియు భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో కురుబకు సంబంధించిన సభ్యులు మాదాసి కురువ మాదారి కురువలం అని ఎస్సీ జాబితాలో చేర్చి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని అడుగుతున్నా రన్నారు OBC 52% క్యాటగిరిలో ఉన్న వాళ్లకు 25 శాతం మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారని అందువలన వాళ్లు షెడ్యూల్ క్యాస్ట్ లోకి రావాలని పోరాటం చేస్తున్నారు కావున OBC లకు 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అలాగే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లు కూడా ఇప్పుడున్న పరిస్థితులకు జనాభా శాతం పెరిగిందని వారికి కూడా వారి జనాభా శాతం ప్రకారం లెక్కించి వారికి తగినంత రిజర్వేషన్ ఇవ్వాలని సోదరులైన ఓబీసీ వాళ్లకు కూడా 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా తెలిపారు .
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రీయ క్రిస్టియన్ మోర్చా జనరల్ సెక్రెటరీ ఎం నాగరాజు, కే నాగలాపురం సురేష్, ఎమ్మార్పీఎస్ మణిరాజు మాధవరావు, పుష్ప రాజ్, మురళి, మహేష్ రాజ్, ప్రవీణ్, చిన్న, రంగస్వామి, గజేంద్ర ,బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.