
కిరణ్ 24×7 న్యూస్ :కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం నందు మదాసి కురువ/మదారి కురువలకు సోషల్ ఆడిట్ ను నిర్వహించిన రెవిన్యూ అధికారులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోని సచివాలయాల నందు ఎస్సీ ఉపకులాల జాబితాను ప్రదర్శింప చేయగా గూడూరు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్నటువంటిమాల,మాదిగలు మదాసి కురువ/మదారి కురువల పైన అభ్యంతరాలు వ్యక్తం చేయగా వారి అభ్యంతరాలను నివృత్తి చేయుట కొరకు గూడూరు మండల తాసిల్దార్ ఇరువర్గాలను కూర్చోబెట్టి సోషల్ ఆడిట్ ను నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మదాసి కురువ/మదారి కురువ కులస్తులు వారి సంఘం నాయకులు మరియు వారి ఆచార వ్యవహారాలలో భాగంగా గురవయ్యల తొ పాల్గొని వారి దగ్గర ఉన్న ప్రభుత్వ జీవోలు, గజెట్లు, కోర్టు ఆర్డర్లను మండల తాసిల్దార్ కి సమర్పించడమైనది. ఈ కార్యక్రమంలో మాదాసి కురువ మదారి కురువ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి మరియు గూడూరు మండల నాయకులు టైలర్ దస్తగిరి కురువ వెంకటేశు జల్లి మధు శివ లాక వెంకటేశ్వర్లు బాలరాజు శ్రీరామ్ కుమారు ఈశ్వరయ్య టైలర్ శ్రీను సుభాష్ మద్దిలేటి భాస్కరు శంకరన్న ముంతన్న రమేషు రాజేషు కొండలయ్య హనుమంతు చిన్న దస్తగిరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.