గూడూరు పల్లె వాణి:
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షులు డి. విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు శాసనసభ సభ్యులు బొగ్గుల దస్తగిరి సూచనలతో, గూడూరు నగర పంచాయతీ పరిధిలోని 173వ బూత్ నందు ఇంటింటికీ సందర్శన కార్యక్రమం చేపట్టబడింది.ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన “సూపర్ సిక్స్” సంక్షేమ పథకాలు గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. వార్డులోని సమస్యలను ఆరాతీశి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేలా సమర్థవంతంగా స్పందించారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ, పాలన ప్రజల వద్దకే తీసుకెళ్లే లక్ష్యంతో ముందడుగులు వేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి,ఇషాక్,జిక్రి,సురేంద్ర, చిరంజీవి,రాజశేఖర్ బెన్నీ,సురేష్,అంజి తదితరులు పాల్గొన్నారు..






