గూడూరు న్యూస్ (కిరణ్)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, కర్నూలు జిల్లా డీసీసీబీ అధ్యక్షులు డి. విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి సూచనలతో గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని 173వ బూత్ పరిధిలో ప్రత్యేకంగా డోర్ టు డోర్ సందర్శన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ప్రజల సమస్యలు వినిపించారు, అవసరాలను గుర్తించారు, అభివృద్ధి చర్యలపై స్పందన తెలుసుకున్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” సంక్షేమ పథకాలు – ప్రతి కుటుంబానికి మేలు చేసే లక్ష్యంతో రూపొందించబడి, దశల వారీగా అమలవుతున్నాయి. ప్రజలకు వాటి గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డులోని ప్రధాన సమస్యలపై అధికారుల దృష్టిని ఆకర్షించి, తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నడుముగా ప్రణాళికలు రూపొందించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి, ఇషాక్, కుక్కల తిమోతి, జిక్రి, సురేంద్ర, నవీన్, రాజశేఖర్ బెన్నీ, సురేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.






