గూడూరు పల్లె వాణి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం క్రింద సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.ఈ సందర్భంగా, కర్నూలు జిల్లా డీసీసీబీ అధ్యక్షులు డి. విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి సూచనలతో గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు – 173వ బూత్ పరిధిలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది.కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు.ప్రజల సమస్యలు వినిపించి, అభివృద్ధి అవసరాలను గుర్తించారు.”సూపర్ సిక్స్” సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడానికి కరపత్రాలను పంపిణీ చేశారు.వార్డులోని ప్రధాన సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.తక్షణ పరిష్కారాల కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, ఇషాక్, కుక్కల తిమోతి, బోజుగు వినోద్ జిక్రి, సురేంద్ర, నవీన్, రాముడు, బాబురావు, రాజు, చంద్ర, రాజశేఖర్ బెన్నీ, సురేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.






