గూడూరు పల్లె వాణి :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ,కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి , కర్నూలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్.డి.విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గూడూరు మండలం పొన్నకల్లు గ్రామం నందు బూతు నెంబర్ 166 లో గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే. సురేష్ 18వ రోజు సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేస్తూ ఆప్యాయతగా పలకరిస్తూ టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకటో తేదీన్నే ఇంటికి వెళ్లి అందజేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం.అలాగే తల్లికి వందనము పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లల తల్లుల అకౌంట్లో 15 వేల రూపాయలు జమ చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా అర్హులైన వారికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరణ చేసి ఐదు రూపాయలకే భోజనం పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజలకు వివరించారు. ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేసినటువంటి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం. డ్వాక్రా మహిళలకు శ్రీనిధి ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేయడం జరిగిందని వివరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్లో ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయడం జరిగింది . రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి 20 వేల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జీలు స్థానిక నేతలు పాల్గొనడం జరిగింది.






