కిరణ్24×7 న్యూస్:
రక్షాబంధన్ పురస్కరించుకొని కోడుమూరు నియోజకవర్గం లోని మహిళ నేతలు కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు రక్షాబంధన్ ను కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.కోడుమూరు మహిళా నియోజక అధ్యక్షురాలు జ్యోతి మరియు మండల అధ్యక్షురాలు అజిమా,శ్రీ ఉమా మహేశ్వరమ్మ మాజీ ఆలయ చైర్మన్,తదితరులు కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్ ను ఆయన నివాసంలో కలిసి రాఖీ పండుగ సందర్బంగా రాఖీ కట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు అన్నా, చెల్లెళ్ళ అక్క, తమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ అని ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంతో  జరుపుకోవాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.