
గూడూరు పల్లె వాణి గూడూరు పట్టణంలోని గూడూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు కేడీసీసీ బ్యాంకు నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సహకార సంఘం చైర్మన్ బొజుగు దానమన్న హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేడీసీసీ బ్యాంకు నందు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బొజుగు దానమన్న మాట్లాడుతూ స్వాతంత్ర సాధనకై ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని వారు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, సీఈఓ శివ కుమార్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.