గూడూరు న్యూస్( కిరణ్ )
గూడూరు నగర పంచాయతీ పరిధిలో గల 7 వ వార్డులో వున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి ఏడవ వార్డు కౌన్సిలర్ రత్నమ్మ వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్ళి వార్డులోని పెద్దలతో కలిసి వార్డులోగల సమస్యలు పరిష్కరించాలని ఆమె వినతి పత్రాన్ని అందజేశారు. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దస్తగిరి వారికి హామీ ఇచ్చారు. కౌన్సిలర్ వెంట నాయకులు పరశురాముడు, బాబు, కృష్ణుడు మరియు గ్రామ పెద్దలుపాల్గొన్నారు.






