కిరణ్ 24×7న్యూస్:
అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్‌ను నిలిపివేయడంతో, రీ-అస్సేస్మెంట్ గడువును విధించింది. ఈ నేపథ్యంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండల ఎంపీడీవోకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు.ఇప్పటికే అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్ నిలిపివేయబడటంతో తీవ్ర వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని. ఇలాంటి దుర్ఘటనలు మరల జరగకుండా ప్రభుత్వం భాద్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.దివ్యాంగులకు వచ్చే ఈ పింఛన్ కారణంగానే కుటుంబసభ్యులు వారిని కనీసం పట్టించుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించాలని బీజేపీ తరపున విజ్ఞప్తి చేశారు.