గూడూరు పల్లె వాణి( కిరణ్), అక్టోబర్ 01:-అమ్మవారి అనుగ్రహంతో గూడూరు పట్టణం లోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని గూడూరు మండలం మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు.






