కోడుమూరు( కిరణ్),..అమ్మవారి అనుగ్రహంతో కోడుమూరు నియోజకవర్గం లోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆకాంక్షించారు.