కిరణ్ 24×7 న్యూస్ :వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) స‌భ్యుడిగా కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి నియ‌మితులు కావ‌డం తో బుధవారం కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గూడూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కి శాలువాలు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి తో పాటు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను గూడూరు మండల నాయకులు శాలువాలు పూలమాలలు వేసి సత్కరించారు . ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ నాయకత్వంలో గూడూరు మండల నాయకులు అందరం కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత బ‌లోపేతం చేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని డాక్టర్ ఆదిమూలపు సతీష్ ని కోడుమూరు ఎమ్మెల్యే చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునితమ్మ, రైతు విభాగం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి నరసింహారెడ్డి, మండల కన్వీనర్ రామాంజనేయులు, మద్దిలేటి రెడ్డి, తిమ్మారెడ్డి, జిల్లా కార్మిక శాఖ కార్యదర్శి దివాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ కార్యదర్శి మాధవస్వామి, గూడూరు మండల ట్రెజరీ రామచంద్రుడు, మునగాల సర్పంచ్ గోపాలు, దౌలత్ భాష, కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బన్న, బడే సాహెబ్, రాముడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.