కర్నూలు 24x7news ( కిరణ్)
హర్షన్నకు శుభాకాంక్షలు తెలిపిన కోడుమూరు ఇన్చార్జి కర్నూలు పల్లెవాణి ( కిరణ్)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) సభ్యుడిగా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి నియమితులు కావడం సంతోషంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. సోమవారం కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని ఆదిమూలపు సతీష్ మర్యాదపూర్వకంగా కలిసి ఎస్ఈసీ సభ్యుడిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న హర్షవర్ధన్‌రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తించి పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) సభ్యుడిగా నియమించడం అభినందనీయమన్నారు. నా రాజకీయ గురువు హర్షన్నతో కలిసి పార్టీని కోడుమూరు నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి తిరిగి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు.
అందరం ఐక్యంగా ముందుకు సాగుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజవర్గం సమన్వయకర్త పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి మరిన్ని పదవులు అలంకరించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డాక్టర్ ఆదిమూలపు సతీష్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
వారి తో పాటు రామకృష్ణారెడ్డి, కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి మైనార్టీ విభాగం అధ్యక్షులు బందే నవాజ్, వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కోడుమూరు మండలం కార్మిక విభాగమ అధ్యక్షులు భాస్కర్, కొత్తూరు రవికుమార్, శ్రీను, మద్దిలేటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.






